TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుఫాన్ కి హైకోర్టు రక్షణ కవచం

Published on: Thu Sep 5, 2013 2:14PM

 

రామ్ చరణ్ తేజ్ నటించిన  తెలుగు సినిమా-తుఫాన్, హిందీ సినిమా-జంజీర్ రెండూ కూడా ఈ 6వ తారీకున విడుదల కానున్నాయి. అయితే చిరంజీవి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొననందుకు సమైక్యవాదులు, సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్నందున తెలంగాణవాదులు మెగా హీరోల సినిమాలు అడ్డుకొంటామని హెచ్చరికలు జారీ చేయడంతో, నిర్మాతలు తమ సినిమాకు రక్షణ కల్పించాలని కోరుతూ నిన్న హైకోర్టులో పిటిషను దాఖలు చేసారు. వారి పిటిషనుపై కోర్టు సానుకూలంగా స్పందిస్తూ తుఫాన్, జంజీర్ సినిమాలు ప్రదర్శన జరిగే అన్ని సినిమా హళ్ళవద్ద భద్రత కల్పించాలని పోలీసులకు కొద్ది సేపటి క్రితం ఆదేశాలు జారీచేసింది.