కర్ణాటక బిజెపికి షాక్
Published on: Sat Nov 3, 2012 2:10PM

కర్ణాటకలో బిజెపికి ప్రభుత్వానీకి మాజీ సీఎం యడ్యూరప్ప వర్గానికి చెందిన 11 మంది మంత్రులు షాక్ ఇచ్చారు. యడ్యూరప్ప డిసెంబర్ 10న బిజెపికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్న సమయంలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీ పెద్దలు అదే పనిగా యడ్యూరప్ప ను అవమానిస్తున్నారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పరిణామాలతో కంగుతిన్న బిజెపి అధిష్టానం యడ్యూరప్ప సహా వారందరినీ చర్చల నిమిత్తం ఢిల్లీకి ఆహ్వానించినా అందుకు ససేమిరా అన్నారు. కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా సాగుతున్న యడ్యూరప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
యడ్యూరప్పను బుజ్జగించే బాధ్యతను అధిష్టాన౦ నరేంద్ర మోడికి అప్పగించారు. నరేంద్ర మోడి యడ్యూరప్ప కు ఫోన్ చేసి బిజెపి లోనే కొనసాగాలని, కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. మోడి అభ్యర్ధనను యడ్యూరప్ప సున్నితంగా తిరస్కరించారు.


