మెదక్‌లో బీజేపీ విజయం ఖాయం: జగ్గారెడ్డి
Published on: Wed Aug 27, 2014 1:33PM
.jpg)
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం బీజేపీలో చేరిన ఆయనను మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పార్టీ బరిలోకి దింపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరడం తనకు సొంత ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తోందని అంటూ తాను మొదట బీజేపీ కార్యకర్తనే అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. టీఆర్ఎస్‌కి ప్రజల మీద కంటే ఉప ఎన్నికల మీదే ప్రేమ ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి జిల్లాకు భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.


