ప్రతిపక్షం లేకపోవడం వల్ల బోర్ కొడుతుంది...

 

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడమే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని.. అలా లేని పక్షంలో తాము అసెంబ్లీ సమావేశాలకు రామని చెప్పారు. చెప్పినట్టే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టారు. దీంతో ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రతిపక్షం లేకపోవడం ఓ రకంగా అధికార పక్షానికి కలిసొచ్చింది. అయితే ప్రతపక్షం లేకపోవడం వల్ల ఓ నేతకు మాత్రం బోర్ కొడుతుందట. అతనెవరో కాదు... భాజాపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ప్రతిపక్షం లేని సభ బోర్ కొడుతోంది. తమ పార్టీ అనుమతిస్తే సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని అంటున్నారు. నేను ఒక్కడినే కాదు... ఇంకా చాలామంది నేతలు బోర్ గా ఫీలవుతున్నారని అన్నారు.