తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర
Published on: Wed Jun 29, 2022 4:43PM
పరమకోటీశ్వరుడు ఒకాయన తన కూతురు పెళ్లికి పెద్ద లిస్టు చేశాడు. ఆభరణాలు, దుస్తులు, ఇతర సామ గ్రి, వచ్చినవారికి రిటర్న్ గిఫ్ట్‌లు పెద్ద జాబితానే తయారయింది. పెళ్లికి అందరూ వచ్చారు. మహాద్భుతం గా, ఆర్భాటంగా జరిగింది. తెలంగాణా బీజేపీ సీనియర్లు కూడా ఒక జాబితా తయారుచేస్తున్నారు. వచ్చే వారం హైదరాబాద్‌లో జరగబోయే బిజెపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఎవర్ని, ఎంత మందిని పిలవా లని. ఈ సమావేశానికి సుమారు 400 మందిని పిలవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారట. మరి వారి మాట విని ఆ జాబితానే ఖరారుచేయాలి. అయితే ఈ మహా సమావేశం తెలంగాణా ప్రభుత్వానికి ఏ మేరకు భయో త్పాతాన్ని కలగజేస్తుందనేది చూడాలి.
ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి ఈ సారి ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని బీజేపీ అధిష్ఠానం భావి స్తోందని తెలిసింది. వీరిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేబినెట్ మంత్రులు, ఆఫీస్ బేర ర్లు, కీలక నేతలు ఉంటారని సమాచారం. పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పర్యవేక్షణలో జాబితా రెడీ అవుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. జూన్ 30వ తేదీనే అతిథులంతా హైదరాబా ద్‌కు చేరుకుంటారని సమాచారం.
బిజెపి తెలంగాణాలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ సమా వేశాన్ని విజయవంతం చేసి తమ సత్తా చాటాలన్నది రాష్ట్ర బిజెపీ సీనియర్ల మాట. చాలా రోజుల క్రితం టిఆర్ ఎస్ నాయకులు బిజెపి వారికి చురక అంటించారు.. బక్కపల్చవాడిని దెబ్బతీయడానికి ఇంత సైన్యంతో హడావుడి చేయడంలో వారిలో టిఆర్ ఎస్ పట్ల పేరు కుపోయిన భయం బయటపడు తోంది. తెలంగాణాలో బూత్ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు, పార్టీ విజయానికి ఏ విధం గా కంకణం కట్టుకున్నారన్నది ఒక నివేదిక కూడా తయారు చేస్తారట.
జూలై 2న హైదరాబాద్ మాదాపూర్ లోని నోవాటెల్ వేదికగా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 3వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని బహింరంగ సభ ఉంటుంది. సభలో ప్రధాని ఏం మాట్లాడతారన్న దానిపై నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు కమల సైన్యం చేయాల్సిన కసరత్తు ఏమిటి? రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ను ఎలా ఢీకొట్టాలి? అజెండా ఏంటి? అనే విషయాలపై ప్రధాని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. 2024లో తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా మోదీ ప్రసంగం ఉంటుందని కూడా చెబుతున్నారు.
మోదీ విందులో తెలంగాణ రుచులు జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి విచ్చేస్తున్న నేతలకు అందించే భోజనం విషయంలో స్థానిక నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా నేతలకు తెలంగాణ రుచులు చూపించాలని నిర్ణయించారు.


