సుప్రీంకోర్టు ఆదేశించింది.. కౌన్సెలింగ్ నిర్వహించండి: కిషన్రెడ్డి
Published on: Mon Aug 4, 2014 8:22PM
.jpg)
ఆగస్టు 31లోపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే తెలంగాణ విద్యార్థులకే నష్టమని ఆయన అన్నారు. విభజన బిల్లులో అంశాలపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. సమయం ఉంటుంది కాబట్టి వచ్చే ఏడాది ఎంసెట్లో మార్పులు, చేర్పులపై ఆలోచన చేయవచ్చునని కిషన్ రెడ్డి సూచించారు.


