కేసీఆర్ సంస్కార హీనుడు: కిషన్‌రెడ్డి
Published on: Tue Aug 12, 2014 1:08PM
.jpg)
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేసీఆర్ సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, మోడీని కేసీఆర్ టార్గెట్ చేయడం మంచిదికాదని హితవు పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ ఫాసిస్టు అనడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కేంద్రాన్ని పిలవకపోవడం సరికాదని అన్నారు. కేసీఆర్ వ్యవహారాన్ని ప్రతిఘటించేందుకు తాము సమాయత్తమవుతున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.


