టీఆర్ఎస్ సర్కారు మీద కిషన్‌రెడ్డి గుస్సా!

 

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అటు సీమాంధ్రకు ప్రాంతానికి చెందిన విద్యార్థులతోపాటు తెలంగాణకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు కూడా నాశనమయ్యేలా వుందన్నారు. ఫీజు రీ ఎంబర్స్.మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం 1956 సంవత్సరాన్ని కటాఫ్ సంవత్సరంగా నిర్ణయించాలని భావించడానికి భారతీయ జనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద సంధించిన వాగ్బాణాలు ఇలా వున్నాయి...

 

1. విదేశాల పౌరసత్వం ఉన్నవాళ్లు కూడా మీ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు గానీ, తెలంగాణలో వున్న ఇతర ప్రాంతాల విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ ఉండకూడదా? ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాలం ఆడితే ఊరుకోం. విద్యార్థుల స్థానికతపై ఇతర రాష్ట్రాల్లో ఏ నిబంధనలు వున్నాయో తెలంగాణలో కూడా అవే నిబంధనలు వుండాలి.

 

2. రైతుల రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది.

 

3. ముఖ్యమైన విషయాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం తలాతోకా లేని నిర్ణయాలు తీసుకుంటోంది.

 

4. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఇంత అహంకారంతో వ్యవహరిస్తున్నారు. తొందరగా అధికారంలోకి వచ్చామని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ మొక్కటే ఉండాలా? ఇతరులెవరూ ఉండకూడదా? కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పటికైనా గద్దెదింపి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.

 

5. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎంత కృషి చేసిందో బీజేపీ కూడా అంతే కృషి చేసింది. అంలాంటి మా పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారా?