టీడీపీ ఎత్తుతో బీజేపీ మైండ్ బ్లాక్..
Published on: Fri Jan 22, 2016 5:12PM
.jpg)
గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఏ పార్టీకి తగ్గ ఎత్తుగడలు ఆ పార్టీ వాళ్లు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు ప్రచారంలో తెగ బిజీగా ఉన్నారు. అయితే అన్ని పార్టీల సంగతేమో కానీ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీల మధ్య సంఘటనలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి పట్టు వల్ల సగానికి పైగా స్థానాలు తీసుకుందామనుకున్న బీజేపీకీకి 150 స్థానాల్లో కేవలం 60 మాత్రమే దక్కాయి. ఈ ఒప్పందానికి బీజేపీ కూడా ఒప్పుకొని సై అంది. కానీ ఇప్పుడు టీడీపీ వేసిన ఓ ఎత్తుగడకి బీజేపీకి దిమ్మతిరిగిపోయిందంట. అదేంటంటే..
గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లు టీడీపీ 90 స్థానాలు.. బీజేపీ 60 స్థానాలు తీసుకుంది. దీనిలో భాగంగానే జూబ్లిహిల్స్ డివిజన్‌ను టీడీపీ బీజేపీకి కేటాయించింది. అయితే మిత్రపక్షానికి సీటు కేటాయిస్తూనే టీడీపీ రెబల్‌గా వేసిన ఆకుల వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ బీ- ఫారం ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అభ్యర్థిగా వెంకటేశ్వరరావుకు బీ-ఫారం అందజేయడంతో ఆయన ఖైరతాబాద్‌లో రిటర్నింగ్ అధికారికి అందించారు. దీంతో టీడీపీ ఎత్తుకు బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యిందంట. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్ది చండ్ర మధు బీ-ఫారం అందజేశారు. దీంతో ఇప్పుడు మిత్రపక్ష పార్టీ నేతల మధ్యే పోటీ ఏర్పడింది. ఎలాగైనా సీటు గెలుచుకోవాలన్న బీజేపీకి ఈ రూపంగా ఎదురుదెబ్బ తగిలింది.


