రోహిత్ ఆత్మహత్యపై సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..
Published on: Sat Jan 23, 2016 10:11AM

వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి మోడీ సర్కార్ కు డ్యామేజ్ తెచ్చిపెడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఇప్పటికే దేశమంతటా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల్ని ఉద్దేశించి నోరు జారారు. రోహిత్ ఆత్మహత్యను కమ్యూనిస్టులు వెనుకుండి నడిపిస్తున్నారని వారి గురించి చెప్పే నేపథ్యంలో "కుక్కలు" అని అభివర్ణించారు. దీంతో ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. మరోవైపు మోడీ రోహిత్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ ఈ దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది అంటూ వ్యాఖ్యానించారు. అయితే మోడీ ఈ వ్యాఖ్య చేయడానికి కాస్త ముందుగా సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియాలో ఇలా వ్యాఖ్యనించారు. మరి సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలకు బీజేపీ ఎలా స్పందిస్తుంది.. అతనిపై చర్యలు తీసుకుంటుందా అన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.


