మజ్లిస్ తో పొత్తు వల్లే బిజెపి బలపడింది: కురియన్ కమిటీ ముందు ఫిరోజ్ ఖాన్
Published on: Fri Jul 12, 2024 5:21PM
తెలంగాణలో జరిగినపార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ బలపడకపోవడానికి కురియన్ కమిటీ రెండో రోజు పోస్ట్ మార్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణలో ఎనిమిది స్థానాలను మాత్రమే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఎన్నికల ప్రచారంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం వల్ల హిందూ ఓటర్లు బిజెపి వైపు వెళ్లారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణపై ఎక్కువ ఆవలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది. బిజెపి అభ్యర్థి మాధవిలత వర్సెస్ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఓడిపోయారు. బలహీన అభ్యర్థిని హైదరాబాద్ నియోజకవర్గం నుంచి నిలబెట్టడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. ఆయన గతంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఫిరోజ్ ఖాన్ స్టేట్ మెంట్ ను కురియన్ కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి.


