TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిజెపి స్కిట్‌... ప్ర‌భుత్వపై నిర‌స‌నకు కొత్త‌మార్గం

Published on: Fri Jun 10, 2022 1:06PM

స‌మాజంలో ప్ర‌తీవారికి ప్ర‌తీ ఒక్క‌రూ న‌చ్చాల‌ని లేదు. రాజ‌కీయాల‌లో అయినా, సామాజిక అంశాల్లోన‌యినా, వ్య‌క్తిగ‌తంగా న‌యినా విభేదాలు, అభిప్రాయ‌భేదాలు వుండ‌వ‌చ్చు. కాకపోతే, కొంద‌రు మౌనంగా  ప‌క్క‌కి తొలు గుతారు, కొంద‌రు గ‌ట్టిగా గోల‌ చేసి చెబుతారు, ఇంకొంద‌రు అవ‌మానించి ఏడిపించ‌డానికే గ‌ట్టిగా  పూను కుంటారు. ఎవ‌రు ఎలా అనుకున్నా, ఎలా వున్నా బిజెపి వారి మార్గం వేరు. ఎలాగ‌యినా స‌రే రోజులో ఒక సారి తెలంగాణా ప్ర‌భుత్వాన్ని తిట్టిపోయాల‌న్న దీక్ష‌బూనిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  వ్య‌తిరేక‌త ప్ర‌దర్శిం చ‌డంలోనూ స‌రి కొత్త మార్గాన్ని అనుస‌రించేరు  తెలంగాణాలో క‌మ‌ల‌నాధులంతా. మామూలు ప్ర‌చారాలు, ఉప‌న్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంతో పాటు స్టేజీ మీద స్కిట్ ద్వారా కూడా  బిజెపి తెలంగాణా ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డింది!
జూన్ రెండ‌వ తేదీన నాగోల్‌లో  అమ‌రుల యాదిలో- ఉద్య‌మ ఆకాంక్ష‌ల సాధన స‌భ పేరిట బిజెపి నాయ కుడు జిట్టా బాల‌కృష్ణారెడ్డి  ప్ర‌త్యేకంగా స‌భ నిర్వ‌హించేరు. అందులో ఇత‌ర తెలంగాణా వీరాభిమానుల‌తో పాటు తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ సందర్భంగా సుదీర్ఘ ఉప‌న్యాసాలు వుంటాయ‌నే అంతా భావించేరు. కానీ స‌భ‌కి వ‌చ్చిన వారిని ఒక స్కిట్ అమితంగా ఆక‌ట్టుకుంది. అది కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని    కించ‌ప‌రిచే విధంగా వుండ‌డంతో కేసీఆర్ వీరాభిమానులు ఆగ్ర‌హించ‌డం మామూలే. ఇది రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప‌రువు తీసేవిధంగా వుంద‌ని  జిట్టా ని వెంట‌నే అరెస్టు చేయాల‌ని, త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిఆర్ ఎస్ మీడియా క‌న్వీన‌ర్ వై.స‌తీష్ రెడ్డి హ‌య‌త్‌న‌గ‌ర్ పిఎస్‌లో ఫిర్యాదు చేసేరు. ఏదో చిన్న‌పాటి పిచ్చిప‌నే అయితే ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించు కోరు. కానీ రెండ‌వ తేదీ స‌భ‌లో స్టేజీ మీద బిజెపి క‌ల్చ‌ర‌ల్ టీమ్ బొడ్డు ఎల్ల‌న్న ప్ర‌ద‌ర్శించిన స్కిట్  కేసీ ఆర్ ప‌రువు తీసేదిగా వుంది. దీన్ని లోక‌ల్ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేయ‌డంతో ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు మండి ప‌డ్డాయి. 

జిట్టాను వెంట‌నే అరెస్టు చేయాల‌న్న డిమాండ్ రావ‌డంతో పోలీసులు మ‌ఫ్టీలో మాటు వేసి గురువారం రాత్రి ఘ‌ట‌కేస‌ర్ టోల్ ప్లాజా వ‌ద్ద  అరెస్టు చేశారు. రాత్రి ఇలా మాటువేసి త‌న‌ను అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌ని, అరెస్టు వారెంటు చూపాల‌ని మ‌ఫ్టీలో వున్న  జిట్టా పోలీసుల‌తో గొడ‌వ‌ప‌డ్డారు. కానీ  ఆయ‌న ప్ర‌శ్నల‌ను  వాళ్లు ప‌ట్టించుకోలేదు.  త‌న‌ను ఎక్క‌డికి తీసు కెళుతున్నార‌న్న‌దీ చెప్పాల‌న్న‌దానికీ పోలీసుల నుంచి స‌మాధానం లేదు.  

ఈ విధంగా అరెస్టుచేసి గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసికెళ్ల‌డం లో ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది ఇపుడు అంద‌రూ అడుగుతున్న‌ ప్ర‌శ్న‌. బండి సంజ‌య్‌, రాణీ రుదమ‌, బొడ్డు ఎల్ల‌న్న అలియాస్ దరువు ఎల్ల‌న్న ఇత‌రుల మీద కూడా కేసులు బుక్ చేసేరు. ఆ స‌భ‌, వేదిక మీద నిర్వ‌హించిన స్కిట్ తాలూకు వీడియోలు ప‌రిశీలించిన త‌ర్వాత అదంతా తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా వుంద‌ని పోలీసులు నిర్ధారించుకుని జిట్టాను అరెస్టు చేసేరు. 

స్కిట్ అయినా, డైలాగుల‌యినా, పాట‌యినా స‌రే ప్ర‌భుత్వం మీద అయిష్ట‌త‌నో, పూర్తి వ్య‌తిరేక‌త‌నో వ్య‌క్తం చేయ‌డానికి ఒక ప‌ద్ధ‌తి, ప‌రిమితీ వుండాల‌ని, జిట్టా అన్ని ప‌రిమితుల‌ను తుంగ‌లోతొక్కి చాలా ఓవ‌రాక్ష‌న్ చేశార‌ని టిఆర్ ఎస్ వీరాభిమానుల మాట‌. మొత్తానికి స్టేజీ మీద స్కిట్స్ ఈవిధంగానూ వుప‌యోగించ‌వ‌చ్చ న్న‌ది  ప్ర‌బుత్వం, కేసీఆర్ వ్య‌తిరేకుల‌కు బిజెపి మార్గ‌ద‌ర్శి అయింద‌నాలి.