TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిజెపి రెండో జాబితాలో ఒకే అభ్యర్థి

Published on: Fri Oct 27, 2023 4:49PM

తెలంగాణ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కీలక నేతలు పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారుతోంది. పలువురు నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ రెండో జాబితా విడుదలైంది. బీజేపీ - జనసేన పొత్తు తెలంగాణలో దాదాపు ఖాయమైంది. ఊహించని విధంగా కేవలం ఒకే అభ్యర్దితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేడు రెండో జాబితా విడుదల చేసింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరుంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మిథున్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు. జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. 2019లో ఆయన బీజేపీలోకి తిరిగొచ్చారు. ఈసారి తన రాజకీయ వారసుడిగా కుమారుడికి బీజేపీ టికెట్ ఇప్పించుకోవడంలో జితేందర్ రెడ్డి కృషి ఫలించింది.