TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓట్ల కోస‌మే ఉమ్మ‌డి పౌర‌సత్వ అంశం... ఓవైసీ

Published on: Sun Oct 30, 2022 3:41PM

దేశంలో త‌మ అధికారం మ‌రింత బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అనుస‌ రిస్త‌న్న మార్గాల‌ను విప‌క్షాల‌న్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. హిందుత్వం, హిందూసంర‌క్ష‌ణ అంటూ దేశంలో అన్నివ‌ర్గాల రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర విభేదాలు సృష్టిస్తున్న‌ద‌ని మండిప‌డు తు న్నాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌ యంలోనే హిందుత్వం అంశం తెర‌మీద‌కు తెచ్చి గొడ‌వ‌లు సృష్టించ‌డం త‌ప్ప దేశాన్ని అభి వృద్ధి ప‌థంలో న‌డిపేందుకు కించిత్ ప‌నిచేయ‌ డంలేద‌ని విప‌క్షాలు భారీ ఆరోప‌ ణ‌ల‌తో దాడిచేస్తున్నాయి.  హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లి రాబోయే గుజరాత్ ఎన్ని కల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడు తూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు.

హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశా న్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరి గిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ స్వచ్ఛందంగా ఉండాలని, తప్పనిసరి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పింది నిజం కాదా? బీజేపీ మాత్రం హిందుత్వ ఎజెండా ను ముందుకు తీసుకు వెళ్లేందుకు, ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తడం ఒక అలవాటుగా మార్చుకుంద‌ని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 25,26,14,20 ఆర్టికల్స్ ద్వారా ఇది సాధ్యమైంది. యూసీసీ అమలు ద్వారా మైనారిటీ హక్కులను పరిరక్షించే ఆర్టికల్ 29కి వ్యతిరేకంగా ఎవరైనా చట్టం చేస్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు.

హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ కింద ఆదాయం పన్ను రిబేట్ ప్రయోజనాల నుంచి ముస్లింలు, క్రైస్తవులను ఎందుకు మినహా యించారో చెప్పాల‌న్నారు. ఇది సమానత్వ హక్కుకు వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి అన్ని కోణాల నుంచి మదింపు చేసేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శనివారంనాడు ప్రకటించిన నేపథ్యంలో ఒవైసీ తాజా వ్యాఖ్యలు చేశారు.