TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణాలో త‌గ్గ‌ని బిజెపి నిర‌స‌న‌లు

Published on: Tue Jun 21, 2022 3:28PM

తాము క‌ష్ట‌ప‌డి సాధించుకున్న‌రాష్ట్రం తెలంగాణాను అతి త్వ‌ర‌లో బంగారు తెలంగాణాగా  మారుస్తామ‌ని టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌గ‌ల్భాలు ప‌లికింది. టిఆర్ ఎస్ నాయ‌కుల‌కు అన్నిచోట్ల బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతు న్నార‌ని, ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నార‌ని అనుకోవ‌డంలో త‌ప్పు లేదు. కానీ  విప‌క్షాల నుంచి కూడా ఎంతో కొంత‌ ఆద‌ర‌ణ పొందాలి క‌దా!  కానీ బిజెపి వ‌ర్గీయులు, అనుచ‌రులు  తెలంగాణా ఎలాగ‌యినా అధికారంలోకి వ‌స్తామ‌ని గ‌ట్టిగా ప్ర‌చారం చేస్తున్నారు.  ముఖ్యంమంత్రి కేసీఆర్ కేంద్రం మీద దృష్టి పెట్ట‌డంతో ఇటు రాష్ట్రంలో అన్ని కార్య‌క్ర‌మాలు, అంద‌రినీ క‌ల‌వ‌డాలు అంతా తానై చేస్తున్నాడు టిఆర్ ఎస్ మంత్రి కేటీఆర్‌. 

ఎంత క‌ష్ట‌ప‌డినా ఈసారి ఎన్నిక‌లు అంత సుల‌భంగా  విజ‌యాన్ని అందించ‌క‌పోవ‌చ్చున‌ని టిఆర్ ఎస్ వారికీ అర్ధ‌మ‌యింది. కార‌ణం ప్ర‌భుత్వం కేవ‌లం భ‌జ‌న‌లు చేయించుకోవ‌డం త‌ప్ప వాస్త‌వానికి యువ త‌కు, నిరుద్యోగుల‌కు చేస్తున్న‌దేమీ లేద‌ని, మొన్న‌టి వ‌ర‌కూ బాస‌ర ఐఐఐటి పెద్ద స‌మ‌స్య‌గానే వుంద‌ని దాన్ని ప‌రిష్క‌రించ‌కుంటే కొంప మునుగుతుంద‌ని కంగారుప‌డి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని విద్యార్ధు ల‌ను శాంత‌ప‌రిచింది. స‌మ‌స్య‌లు ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి కేసీఆర్ ప్ర‌భుత్వానికి నిద్ర‌లేకుండా చేస్తు న్నాయి. 

రాష్ట్రంలో ప‌రిస్థితులు టిఆర్ ఎస్‌కు గొప్ప అనుకూలించేవిగా క‌న‌ప‌డుతున్న‌ప్ప‌టికీ బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో బిజెపీ వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నారు. చిన్న‌పాటి లోపాల్ని కూడా తెర‌మీద‌కి తెచ్చి టిఆర్ ఎస్ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు నిద్ర లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్ధుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా, ఫ్లై ఓవ‌ర్ల మీద కోట్లు త‌గ‌లేయ‌డ‌మేమిట‌ని బిజెపి విరుచుకుప‌డుతోంది. 

హైదరాబాద్‌‌లోని ఐటీ కారిడార్‌లో కొత్త ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఉదయం కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఖైతలా పూర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ ఫ్లైఓర్‌తో హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి వరకు, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వారికి ట్రాఫిక్ భారం తగ్గనుంది.

సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. ఖైతాలాపూర్ ఫ్లైఓవర్  ప్రారంభోత్సవంలో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సభా ప్రాంగ ణం వద్ద ‘మంత్రి కేటీఆర్  నిరుద్యోగ భృతి ఎక్కడా?.. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడా? అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ  బీజేపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. బల్దియా సిబ్బంది వాటిని తొలగించింది.