నేడు హైదరాబాద్‌కి అమిత్ షా రాక
Published on: Thu Aug 21, 2014 5:43AM

బీజేపీ స్టార్ లీడర్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించున్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కి వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటిసారి దక్షిణాది రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన హైదరాబాద్‌కి వస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదే వేదికమీద పలువురు బీజేపీలో చేరతారు. వారిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా వుంటారని తెలుస్తోంది. అలాగే శుక్రవారం నాడు సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే బీజేపీ గ్రామాధ్యక్షుల సదస్సులో కూడా అమిత్ షా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీని మరింత పటిష్టం చేసి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులను కూడా కలుస్తారు.


