బీజేపీ మాస్టర్ ప్లాన్.. ముందస్తు ఎన్నికలు?

 

2014 వరకు ఒక లెక్క 2014కి ఒక లెక్క అన్నట్టుగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించింది.. మోడీ పీఎం అయ్యాడు.. తర్వాత బీజేపీ ఇంకా బలపడుతూ వచ్చింది.. మోడీ, అమిత్ షా సాయం తో బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా చేయాలనుకున్నాడు.. దీంతో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కోలుకోవడం కష్టం అనుకున్నారు.. మళ్ళీ మోడీనే పీఎం అవ్వడం ఖాయం అనుకున్నారు.. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవ్ కదా..

బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.. మిత్రపక్షాలు దూరమయ్యాయి.. ప్రజల్లో బీజేపీ మీద రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. అందుకే బీజేపీ ఆలోచనలో పడింది.. వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్న భయంతో మాస్టర్ ప్లాన్ వేసింది.. ఆ ప్లానే ముందస్తు ఎన్నికలు.. ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది సమయం ఉంది.. ఇప్పటికే ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ మీద ఏర్పడిన వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి..

దీనికితోడు త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడుతుంది.. ఆలస్యం అవుతున్న కొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భావించిన బీజేపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుందట.. వచ్చే ఏడాది మధ్యలో జరగాల్సిన ఎన్నికలని ఈ ఏడాది చివరికి నిర్వహించాలని చూస్తుందట.. మరి బీజేపీ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందో లేదో భవిష్యత్తులో తెలుస్తుంది.