Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ
posted on: May 1, 2015 12:04PM

గత ఏడాది నవంబర్ 1వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీగా జీజేపీ సరికొత్త రికార్డును సృష్టించిందని ఆయన తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో 8 కోట్ల 60 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండగా దానిని తాము అధిగమించామని, బీజేపీలో సభ్యుల సంఖ్య 10.5 కోట్లకు చేరుకున్నందుకు చాలా సంతోషనంగా ఉందని అన్నారు. ఈ క్రెడిట్ అంతా బీజేపీ కార్యకర్తలదే అని, వాళ్ల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 1.82 కోట్ల మంది పార్టీలో చేరారని పేర్కొన్నారు.






