TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష.. బీజేపీ కొత్త లెక్కలు..

Published on: Thu Feb 24, 2022 1:51PM

ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా? సంక్షేమాన్ని కోరు కుంటారా? అంటే, రెండూ కోరుకుంటారు, అయితే సంక్షేమాన్ని కొంచెం ఎక్కువ కోరుకుంటారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలు, పాలక పక్షాలు మేథావి వర్గాల ఆలోచనలు, విమర్శలను పక్కన పెట్టి, సంకేమానికే జై కొడుతున్నాయి. ఉదారణకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, యూపీ రాజకీయాలు ప్రధానంగా కులం, మతం చుట్టూనే తిరుగు తుంటాయి అనుకుంటాం. నిజానికి ఒకప్పుడు అదే నిజం. అయితే ఇప్పడు, కులం మతం, ఉగ్రవాదంతో పాటుగా, ‘సంక్షేమం’ కూడా కీలక అంశంగా ప్రచారం జరుగుతోంది. 

నిజానికి, బీజేపీ మొదటి నుంచి ‘ఉచితాల’కు వ్యతిరేకం.  అయితే, అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు బీజేపీ కూడా ప్రజాకర్షక సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. అంతే కాదు,యూపీ ఎన్నికల్లో బీజేపే గెలుపుకు,సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలుస్తానియని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్త పరుస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సింహభాగం యూపీకే దక్కుతుండటం, రాష్ట్రంలోనూ గత ఐదేళ్లలో తమ సర్కారు పలు ప్రజాకర్షక పథకాలను విజయవంతంగా అమలుచేయడం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అతిపెద్ద సానుకూలాంశాలని బీజేపీ ధీమాగా చెబుతోంది. మరోవైపు యూపీలో బీజీపీకి గట్టి పోటీ ఇస్తున్నసమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూడా, ధరల పెరుగుదల  వంటి ఇతర అంశాలతో పాటుగా, సంక్షేమ పథకాలను కూడా ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. ఎస్పీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్, తమ పార్టీ అధికారంలోకొస్తే పేదల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. 

నిజానికి, 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ. ఓటర్లు అభివృద్ధి కంటే, సంక్షేమ,  వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న వైనాన్ని గుర్తించింది. అందుకే, తొలి ఐదేళ్లలోనే,  పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల్‌ యోజన, పీఎం కిసాన్‌ నిధి యోజన, ముద్ర రుణాలు, పీఎం జీవన్‌ సురక్షా యోజన వంటి ప్రత్యక్ష ప్రయోజన పథకాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. 

కాగ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ప్రథకాల వలన 2014-19 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్లమంది పేద ప్రజలు లబ్ధి పొందారు. ఆ ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనిపించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీజి  17.1 కోట్ల ఓట్లు రాగా.. 2019లో ఆ సంఖ్య 22.9 కోట్లకు పెరిగింది. ఈ మేరకు సీట్ల సంఖ్య కూడా పెరింగింది,  కుల, మత సమీకరణాలతో పాటు సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాగా దోహదపడ్డాయి. అందుకే ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మోదీ, యోగి ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై కమలదళం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేర్లు పెట్టుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న నేపధ్యంలో సంక్షేమ  ప్రయోజనాలు నేరుగా లబ్దిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటోంది.  సో, యూపీ ఎన్నికలలో కమల దళాన్ని సంక్షేమ పథకాలు నిజంగా కట్టేక్కిస్తే, ముందు ముందు దేశ రాజకీయలు పూర్తిగా సంక్షేమం చుట్టూనే తిరుగుతాయని వేరే చెప్పనక్కరలేదు.