ఏపీ ప్రభుత్వాన్ని అవమానించిన కేంద్రం.!!
Published on: Thu Aug 23, 2018 1:03PM
ఎన్డీయే నుండి బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న టీడీపీకి.. ఇన్నిరోజులు బీజేపీ నుండి విమర్శలు, ఆరోపణలే ఎదురయ్యాయి.. కానీ రీసెంట్ గా టీడీపీకి ఘోర అవమానం జరిగింది.. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థను గతంలోనే స్థాపించారు.. అప్పట్లో నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా నడిపారు.. తర్వాత విజయవాడలో ఐటిఐ కళాశాలలో ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులతో ఈ కళాశాల క్యాంపస్ ను నిర్మించారు.. అయితే దీని ప్రారంభోత్సవానికి అసలు ఏపీ ప్రభుత్వ ఉనికే లేకుండా కేంద్ర అధికారులు ఏర్పాట్లు చేశారు.. శిలాఫలకంపై పేర్లు కాదు కదా అసలు ఏపీలో ప్రభుత్వమే లేదన్నట్లుగా వ్యవహరించారు.
ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించకపోవడంపై ఉపరాష్ర్టపతి కార్యాలయంతో పాటు గవర్నర్ కార్యాలయం కూడా ఆరా తీసింది.. చంద్రబాబుకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఆహ్వానించలేదనే సమాధానం వినిపించింది.. అయితే భవనాల ప్రారంభోత్సవానికి సంబంధిత ఎమ్మెల్యే, జిల్లా మంత్రుల పేర్లు కూడా ఆహ్వాన పత్రికలో లేవు.. దీంతో ఇదంతా కావాలనే చేసారని అర్ధమై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌ను మేయర్ కోనేరు శ్రీధర్ ప్రశ్నించారు.. ఆ తర్వాత అధికారులు కొత్త శిలాఫలాకాన్ని ఏర్పాటు చేశారు.. అలాగే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేనికి ఫోన్‌చేసి ఆహ్వానంపై సమాచారం ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం కావాలనే అవమానపరుస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



