ఇంట వోడి రచ్చ మీద రాణిస్తున్న వెంకయ్యనాయుడు
Published on: Sat May 12, 2012 9:26AM
రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు పార్లమెంటరీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు భారతీయజనగాపార్తీ జాతీయ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. అయినా సరే! ఆ పార్లమెంటరీ స్థానానికి బిజెపి అభ్యర్థిని రంగంలోకి దించటం లేదు. ఎందుకంటే అక్కడ ఒడమిపాలైతే వెంకయ్యకు ఇబ్బంది కరంగా ఉంటుందని బిజెపి రాష్ట్రపార్టీ భావిస్తోంది. జాతీయస్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు తన సొంత జిల్లాలో అసలు పార్టీ ఎదుగుదలకు కృషి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు.
అయితే వెంకయ్యనాయుడు విషయంలో ఇది రివర్స్ అయింది. ఆయన ఇంట గెలవలేని స్థితిలో ఉన్నారు. రచ్చ మీదమాత్రం రాణిస్తున్నారు. జాతీయస్థాయిలో అధికారంలోకి మళ్ళీ రావాలనుకుంటున్న బిజెపి నెల్లూరులో తన అభ్యర్థిని రంగంలోకి దించలేని బలహీన స్థితిలో ఉంది. ఇదే పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎక్కడో విశాఖ నుంచి వచ్చి ఈ స్థానం నుంచి పోటీ చేస్తుంటే స్థానికంగా సంబంధబాంధవ్యాలున్న వెంకయ్య మాత్రం ఎందుకు ఈ పార్లమెంటు స్థానాన్ని వదిలేశారని బిజెపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోతే వెంకయ్యనాయుడు పరువుతో పాటు పార్టీ ప రువు కూడా పోతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భయపడుతోంది.


