ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు

 

టీడీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా పట్టుదలగా నిలబడి తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ.. అలాంటి పార్టీ, అసలు ఎన్నికల తరువాత లేకుండా ఎలా పోతుంది అనుకుంటున్నారా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు చెప్తున్నారు మరి.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 120 లోక్ సభ స్థానాలు గెలవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోందని, అలానే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.. అంతేనా, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశం లేదని, అసలు టీడీపీ పార్టీనే ఉండదని అన్నారు..

టీడీపీ ప్రభుత్వం మీద, నాయకుల మీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకతను బీజేపీ అవకాశంగా మలుచుకొని రంగంలోకి దిగుతుందని అన్నారు.. అలానే ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు.. చంద్రబాబుకు గంగా యమున సరస్వతి పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని, గంగ ఎవరో యుమున ఎవరో సరస్వతి ఎవరో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమైందని, ఏపీలో టీడీపీకి, తెలంగాణాలో తెరాసకి గట్టిపోటీ ఇస్తామని అన్నారు.. చూద్దాం మరి బీజేపీ వ్యూహాలు ఫలించి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తుందో లేదో.