TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిజేపీ మునిసిపల్ అభ్యర్థి ఆత్మహత్య

Published on: Tue Feb 10, 2026 11:27AM

నారాయణపేట జిల్లా మక్తల్  మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరుకలి మహదేవప్ప  సోమవారం (ఫిబ్రవరి 9) అర్థరాత్రి తన నివాసంలో ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహదేవప్ప   ఆత్మహత్యకు  కారణాలపై మక్తల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మహదేవప్ప ఆత్మ హత్యపై   అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదలా ఉండగా మహదేవప్ప ఆత్మ హత్యకు పాల్పడటం రాజకీయంగా  తీవ్ర దుమారం రేపింది.  

విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ డీకే అరుణ మక్తల్‌కు చేరుకుని మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహదేవప్పది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ కాంగ్రెస్ చేసిన హత్యేనని అన్నారు.   బెదిరింపులలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను మించిపోయిందని విమర్శించారు. ఒత్తిడి, బెదరింపుల వల్లే  మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారన్న డీకే అరుణ..  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్  చేశారు.   మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఇటీవల తాను పాల్గొన్న రోడ్ షో, బీజేపీ సమావేశాలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఓటమి భయంతో బెదరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.  

గత కొద్ది రోజులుగా బీజేపీ అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా  బెదరింపులు వస్తున్నాయన్న డీకే అరుణ.. కోస్గి నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించి,  కాంగ్రెస్‌లో చేర్చుకున్నారంటూ ఎంపీ అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే, కోస్గి నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని , సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని డీకే అరుణ ఇరోపించారు.