దేవుడా.. సుబ్రహ్మణ్యస్వామిని ఆపేవారు లేరా..?
Published on: Fri Jun 24, 2016 12:06PM
.jpg)
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నోటికి అడ్డు అదుపూ లేకుండా పోతుంది. నోరు ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ల మీద విమర్శలు చేయడం.. ఏది అనాలనిపిస్తే అది అనేయడం ఆయనకు కామన్ అయిపోయింది. మొన్నటి వరకూ రఘురామ్ రాజన్ పై విమర్శలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి.. ఆఖరికి మళ్లీ ఆయనకు పదవి ఇచ్చినా వద్దు మహాప్రభో అనే పరిస్థితికి వచ్చారు. ఇక ఆతరువాత కేంద్ర అర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై రెచ్చిపోయారు. ఆయన కాంగెస్ నేత అని..పార్టీ వ్యతిరేకుల్ని పార్టీలో ఉంచకూడదని.. ఆయనను పదవి నుండి తొలగించాలని అన్నారు. ఇక దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ.. అరవింద్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకుండా తమ పని తాము చూసుకోవాలని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.
అయినా స్వామి గారు వింటారా.. ఇప్పుడు మరో విషయంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. విదేశీ పర్యటనలు చేసే దుస్తుల గురించి కామెంట్లు చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వారు టై, కోట్ ధరిస్తే వెయిటర‍్లలా కనిపిస్తారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో స్వామి చేసే వ్యాఖ్యలపై బీజేపీ నేతలే తలలు పట్టుకునే పరిస్థితి వచ్చారు. ఆయనను ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా స్వామి ఒకవైపు అంతలా రెచ్చిపోతుంటే ప్రధాని మోడీ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు అని.. ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదు అని అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని ఆమాత్రం ఎదుర్కోవాలంటే స్వామి లాంటి వారు కావాలని అనుకుంటున్నారేమో మోడీ అందుకే అతన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. స్వామి ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఎవర్ని టార్గెట్ చేస్తారో చూడాలి.


