TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంత శాడిజం ఏంటి స్వామి..

Published on: Wed Jun 22, 2016 4:17PM

 

మొన్నటి వరకూ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పై తన ప్రతాపాన్ని చూపిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు మరో అధికారిపై కూడా తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయ్యారు. సుబ్రహ్మణ్యస్వామి రాజన్ పదవిపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రఘురామ్ రాజన్ తప్పుడు విధానాలవల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుదలకు దారి తీసిందని.. రాజన్ తీసుకుంటున్న చర్యల మూలంగా ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉందని.. వడ్డీ రేట్లు పెంచాలనే యోచన సరైంది కాదని.. ఆ ఫలితాన్ని దేశం అనుభవిస్తోందని.. వెంటనే రాజన్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు దీని గురించి ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. దీనిపై చర్చ కూడా బాగానే జరిగింది. ఒకపక్క స్వామి గారు రాజన్ వద్దని వితండవాదం చేస్తున్నా.. మరోవైపు నెటిజన్లు మాత్రం ఈసారి కూడా రాజనే గవర్నర్ కావాలని అంటున్నారు. దీనిపై మోడీ కూడా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనుకోండి. అయితే మళ్లీ తనకు పదివి వస్తుందో లేదో తెలియదు కాని రాజన్ మాత్రం స్వామి దాటికి తట్టుకోలేకనో ఏమో.. తాన పదవికాలం అయి పోయిన తరువాత తిరిగి చికాగో వెళ్లి ఉపాధ్యయ వృత్తిలోనే పాఠాలు చెప్పుకుంటానని చెప్పారు. పాపం అలా రాజన్ స్వామి టార్చర్ తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు.

 

ఇక్కడితో రాజన్ చాప్టర్ అయిపోయింది అనుకంటే.. ఇప్పుడు మరో అధికారిపై స్వామి దాడికి దిగారు. అది కూడా ప్రధాని ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై. అరవింద్ సుబ్రమణియన్ కాంగ్రెస్ వ్యక్తని, ఇలాంటి వ్యక్తిని సలహాదారునిగా నియమించడం తప్పని.. ప్రభుత్వ వ్యతిరేకుల్ని సాగనంపాలని.. అందుకే ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు స్వామి అరవింద్ సుబ్రమణియన్ గురి పెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు స్వామి ఆరోపణలు ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం విశేషం. అది ఆయన అభిప్రాయం మాత్రమేనని, అటువంటి వ్యాఖ్యలు పార్టీలో నేతల మధ్య విభేదాలు సృష్టిస్తాయని.. స్వామి వార్తల్లో నిలిచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పాలనా సంబంధ వ్యవహారాల్లో ఈ తరహా వ్యాఖ్యలు తగవని, అదికూడా సొంత పార్టీపైనే చేస్తుంటే, ప్రజల్లో చులకన అవుతామని అంటున్నారు. ఆర్బీఐ తదుపరి గవర్నరుగా రేసులో  అరవింద్ సుబ్రమణియన్ ఉన్న సంగతి తెలిసిందే.

 

మరి స్వామి చేసిన రచ్చకు రఘురామ్ రాజన్ మళ్లీ పదవి ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేరని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమైపోయింది. ఇప్పుడు ఇంకా గవర్నర్ పదవి రేసులో ఉండగానే స్మామి అరవింద్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అరవింద్ స్వామి చేసిన వ్యాఖ్యలను పట్టించుకుంటారా.. లేక ఆ పోరు తట్టుకోలేక పదవే వద్దనుకుంటారా చూడాలి.