ఎవరు ఇచ్చారు? ఎవరిని అడుగుతున్నారు?

తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై  భాజపా ఎంపీ రాకేశ్‌ సింగ్‌ సభలో మాట్లాడారు.విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి నిలదీయటమేంటని ఆయన ప్రశ్నించారు.ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడితే వారు పరిపాలన చేయడమే ప్రజాస్వామ్యం.

 

 

స్వాతంత్య్రం వచ్చాక 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీయే దేశాన్ని పాలించింది.మన్మోహన్‌ పదేళ్ల కాలం కూడా సోనియా పరిపాలించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ పాలనలో అన్నీ స్కామ్‌లే అని తెలిపారు.దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. పరస్పర విరుద్ధమైన పార్టీలు ఏకమై అవిశ్వాసం తీసుకొచ్చాయి. ప్రజలు నమ్మిన ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయిన పార్టీలు తెచ్చిన అవిశ్వాసం ఇది. మొదటిసారిగా ఇంత మెజార్టీతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడింది. మోదీ పారదర్శకమైన పాలన అందిస్తున్నారు.మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారంలో కాంగ్రెస్‌, తెదేపాల సాన్నిహిత్యాన్ని లోకం చూసింది. కాంగ్రెస్‌కు దగ్గర కాగానే తెదేపా సభ్యులు శాపగ్రస్తులయ్యారు.