సోము వీర్రాజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు...

 

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా కుట్రలో భాగమేనని, 2019లో చేయబోయే నేరపూరిత కుట్రకు ముందస్తు హెచ్చరికగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. హింసను ప్రేరేపించే విధంగా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా, తమ ప్రాణాలను అడ్డుపెట్టి చంద్రబాబును కాపాడుకుంటామని, ఐదు కోట్ల మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు బాబుకు అండగా ఉన్నారని అన్నారు.