"మిస్టర్ పీఎం" తప్పా... గుడ్డలూడదీసి కొడతాం తప్పు కాదా..!


బీజేపీ-టీడీపీ ల మధ్య దూరం రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు పార్టీలు ఎప్పుడు విడిపోతాయా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. మరోపక్క రెండు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విచిత్రమైన విమర్సలు చేశారు. ఇప్పుడు రాజు గారికి దొరికిన సాకు ఏంటంటే... మోడీ గారిని 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని అన్నారట.

 

కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన మోడీని 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని సంబోధించారు. ఇప్పుడు ఇదే రాజు గారికి సాకుగా దొరికింది. టిడిపి నేత ఒకరు ప్రధాని మోడీనీ...'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని అన్నాడని తెగ గుంజుకున్నారు ఆయన. దీంతో మిస్టర్‌ప్రైమ్‌ మినిస్టర్‌ అంటే తప్పేంటి..అదేమీ అగౌరమైన పదమేమీకాదు కదా అని అంటున్నారు. అంతేకాదు..గతంలో వైసీపీ నేతలు మోడీని ఇంతకన్నా దారుణంగా మాట్లాడారు... 'భూమన కరుణాకర్‌రెడ్డి'  అయితే ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేకహోదా...ప్రకటించకపోతే..గుడ్డలూడదీసి కొడతామని  చాలా పరుషమైన పదజాలాన్నే వాడారు. మరి అప్పుడు ఈయనగారు ఎక్కడికి వెళ్లారో.. ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఎవరూ స్పందించలేదు. మరి గుడ్డలూడదీసి కొడతామనడం వారి దృష్టిలో సభ్యతేమో...? అందుకే స్పందించలేదేమో...? తమతో వైకాపా నేతలు లాలూచీ పడ్డారు కనుక..వారు ఎంతటి అసభ్య మాటలు మాట్లాడినా...బిజెపి నేతల దృష్టిలో అవి తప్పు కాదు...? గౌరవ సూచికంగా మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ అంటే...తప్పట..? ఏదో కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు.. ఒకపక్క బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని ప్రతిఒక్కరూ మండిపడుతుంటే... వీళ్లేమో మోడీని 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అన్నారని.. సిల్లీ రీజన్స్ తో ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటున్నారు. ఏది ఏమైనా... ఇష్టమైన వాళ్లు ఏం చేసినా తప్పులేదు.. ఇష్టం లేని వాళ్లు ఏం చేసిన తప్పే అన్నట్టు ఉంది బీజేపీ వ్యవహారం..