TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే...అమ్మాయిలను రోడ్లమీద వదిలేస్తే అంతే..!

Published on: Wed May 2, 2018 3:29PM

 

మోడీ ఎంత చెప్పినా బీజేపీ నేతల నోర్లు ఏ మాత్రం కంట్రోల్ లో ఉండటం లేదు. ఇప్పటికే పలువురు నేతలు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... పలువురి చేత విమర్శలు చేయించుకున్న సంగతి తెలసిందే. ఇప్పుడు తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని బైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్  ఉన్నావో అత్యాచారం కేసుపై మాట్లాడుతూ.... అమ్మాయిలను అలా రోడ్ల మీద వదిలేస్తే అత్యాచారాలు జరక్కుండా ఎలా ఉంటాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా, దీనంతటికీ కారణం తల్లిదండ్రులేనని అన్నారు. పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడం వల్లే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించి దుమారం రేపారు. అంతేకాదు... 15 ఏళ్ల లోపు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని, వారికి స్వేచ్ఛ ఇవ్వకూడదని... అలాగే సెల్‌ఫోన్లు కూడా వారికి ఇవ్వొద్దని హితవు పలికారు. ఇక ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని ప్రతిపక్షాలు కామెంట్లు చేయడం మొదలుపెట్టాయి.