Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ బీజేపీకి బిగ్ షాక్.. జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల!!
posted on: Jan 7, 2019 12:05PM

ఏపీలో బీజేపీకి ఊహించిన షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో తలెత్తిన పరిణామాలను తనకు రుచించలేదని.. కన్నా లక్ష్మీనారాయణకు, పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితో పాటు తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆకుల సత్యానారాయణ జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. మరోవైపు ఆకుల సతీమణి జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.






