మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు.. షాకిచ్చిన బీజేపీ మంత్రి..

 

"మోడీ ప్రపంచలోనే అత్యంత అవినీతిపరుడైన ప్రధాన మంత్రి అంటా".. ఇలా అన్నది ఎవరో కాదు.. స్వయంగా ఓ మంత్రిగారే.. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నోరు జారుతుండటం కామన్. ఒక్కోసారి ఆవేశంతో పక్క పార్టీల నేతలపై విమర్శలు చేయబోయి.. తమ పార్టీనే విమర్శిస్తారు. ఆ తరువాత నాలుక్కరుచుకొని.. తప్పుని గుర్తిస్తారు. ఈలోపు జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది మోడీకి. అసలే గుజరాత్ ఎన్నికల్లో చచ్చి గెలిచినందుకు సంక్షోభంలో పడ్డారు. ఇలానే ఉంటే ముందు ముందు పరిస్థితి చాలా దారణంగా ఉంటుందని.. మోడీ-షా ద్వయం... ఆలోచనలో పడ్డారు. ప్రజలకు తమపై ఉన్న వ్యతిరేక భావాన్ని ఎలా పొగట్టాలా అని ఆలోచిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు...బీజేపీ నేతల అత్యుత్సాహం వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ అత్యుత్సాహం వల్లే ప్రధాని మోడీని  ఏకంగా అవినీతిపరుడు అని అన్నాడు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజస్తాన్ మంత్రి డాక్టర్ జస్వంత్ సింగ్ యాదవ్ ప్రధాని మోడీని ప్రశంసించాలనుకున్నారు. ఆ ఉద్వేగంలో ఈ రోజు ఎంతో మంచి రోజు అని, అత్యంత గౌరవనీయులైన, ఎంతో ఖ్యాతిగాంచిన మన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, ఆయన నాయకత్వంలో ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అని వ్యాఖ్యానించారు. ఇంకేముంది ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఉన్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడదామా అని పార్టీలకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది.

 

విచిత్రం ఏంటంటే.. ఆయన పక్కన ఉన్న వారు కూడా గుర్తించలేకపోవడం. గుర్తించి ఆయనను వారించలేదు. అప్పటికి అంతా అయిపోయింది. మంత్రిగారు చేసిన మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు మెయిన్ ఎడిషన్ లో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రత్యక్షమయ్యాయి. అప్పటికిగానీ తెలయదు బీజేపీ నేతలకు ఎంత పెద్ద తప్పుచేశామో అని. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. అలాగే ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి మంత్రిగారి భవిష్యత్ ఏంటో...? ఆయనపై యాక్షన్ తీసుకుంటారో.. వదిలేస్తారో..?