తిరుగులేని బీజేపీ.. మోదీ-యోగి కాంబినేషన్ సూపర్ హిట్..
Published on: Thu Mar 10, 2022 10:12AM
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. కాదు ఫైర్. డౌట్ ఉంటే యూపీ వైపు చూడండి.. కమలం పార్టీ స్టామినా ఏంటో తెలుస్తుంది. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా.. దూసుకుపోతోంది బీజేపీ. డబుల్ సెంచరీ దాటేసి.. త్రిబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. సైలెంట్‌గా పని చేసుకుపోయిన యోగి.. హంగామా చేసిన మోదీ.. ఈ ఇద్దరి కాంబినేషన్ ఉత్తర ప్రదేశ్‌లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తున్నాయి.
పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ దూసుకుపోయింది. 403 స్థానాలున్న యూపీలోర బీజేపీ 270కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ సెంచరీ కోసం కష్టపడుతోంది. ఇక కాంగ్రెస్ ఖేల్ ఖతం- దుఖాణం బంద్.
ఇక, పంజాబ్‌లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీలు బిగ్ షాక్ ఇచ్చారు. మొత్తం 117 స్థానాలకు గానూ ఇప్పటికే 70కు పైగా స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 20 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే.. పంజాబ్‌లో కాంగ్రెస్ పని ఫసక్.


