TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళలతో కలిసి అసభ్యకర డ్యాన్సులు! ఏపీ బీజేపీ ఆఫీసులో రచ్చ రంభోలా.. 

Published on: Sun Jan 2, 2022 1:22PM

అది కాలేజీ స్టూడెంట్స్ ఫంక్షన్ కాదు.. పాత విద్యార్థులంతా చాలా రోజుల తర్వాత సరదాగా కలుసుకుని ఆడి పాడే పార్టీ కూడా కాదు. అయినా అక్కడ అంతా చిందులేశారు. అది కూడా ఎప్పుడు సంప్రదాయం, సంస్కృతి అని మాట్లాడే పార్టీ కార్యాలయంలోనే ఇది జరిగింది. గౌరవ మర్యాదలు, దేశభక్తి గుర్తించి జనాలకు గొప్పగా లెక్చర్లు ఇచ్చే పార్టీ ఆఫీసులో తీన్మార్ స్టెప్పులు వేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూ ఇయర్ సందర్భంగా రాజకీయ పార్టీ ఆఫీసుల్లో కేక్ కటింగులు ఇప్పుడు కామన్ గా మారాయి. అందులో భాగంగా ఏపీ బీజేపీకి చెందిన విజయవాడ పార్టీ ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంతోషంలో పాత పాటల్ని ప్లే చేశారు. ఒకప్పటి సూపర్ హిట్ పాట.. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ను ప్లే చేశారు. పార్టీ ఆఫీసులో ఆ పాట ప్లే చేయడమే సరికాదంటే.. ఆ తర్వాత మరో అరాచకం జరిగింది. కమలం నేతలు ఆ పాటకు వేదిక మీద డ్యాన్సులు వేశారు. మహిళా నేత ఒకరు బీజేపీ నేతతో కలిసి తీన్మార్ స్టెపుల్లేసింది. ఒక జాతీయ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు ఇలా పాటలకు పార్టీ కార్యాలయంలో స్టెప్పులు వేస్తున్న వీడియోను చూసి జనాలు విస్తుపోతున్నారు.

ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నాయకుల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. 50 రూపాయలకే లిక్కర్‌ అందిస్తామని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన నవ్వులపాలైంది. వీర్రాజు ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వివాదం కొనసాగుతుండానే తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హంగామాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.