TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెబల్ స్టార్ కి దుర్గ గుడిలో ఘోర అవమానం

Published on: Mon Oct 7, 2019 5:06PM

 

బీజేపీ నేత , కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజుకు.. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అవమానం జరిగింది. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనేందుకు.. ముందుగా సమాచారం ఇచ్చి మరీ కుటుంబంతో సహా కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి వచ్చారు. అయితే ఒక్క అధికారి కూడా ఆయనను పట్టించుకోలేదు. మాజీ కేంద్రమంత్రి అనే ప్రోటోకాల్ కూడా మర్చిపోయి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. దీనితో ఆయన సాధారణ భక్తుల మాదిరి ఆరు అంతస్తులు ఎక్కారు. ఆయనకున్న వయస్సు రీత్యా పలుమార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు. చివరికి అతి కష్టం మీద కుంకుమార్చన వద్దకు చేరుకున్నారు. 

కృష్ణంరాజును ఆలయ అధికారులు అంతగా ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సాధారణ వైసీపీ నేత వస్తే.. సకల మర్యాదలు చేస్తున్న ఆలయ అధికారులు ఇతరులు వస్తే మాత్రం కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను ఆలయానికి వస్తున్నట్లుగా కృష్ణంరాజు ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలపై పాలక వర్గాలకు ఉన్న కోపంతో.. తాము కృష్ణంరాజుకు మర్యాదలు చేస్తే.. పై అధికారులకు ఎక్కడ కోపం వస్తుందోనన్న ఉద్దేశంతో.. దుర్గ గుడి అధికారులు కావాలనే పట్టించుకోలేదని చెబుతున్నారు. క్యూ లైన్ లో కృష్ణంరాజు ఇబ్బందులు చూసి సామాన్య భక్తులే అయ్యో అనుకున్నారు. కృష్ణంరాజుని బీజేపీ నేతగా, మాజీ కేంద్రమంత్రిగా కాకపోయినా.. ఆయన వృద్ధాప్యం, ఆనారోగ్యం దృష్ట్యా అయినా.. ఆయనకు ఇబ్బందిలేకుండా అమ్మవారి దర్శనం చేయించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.