TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాడు గవర్నర్ గా కృష్ణం రాజు..! 

Published on: Thu Jan 7, 2021 4:56PM

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ కేంద్ర‌మంత్రి, బీజేపీ నేత అయిన కృష్ణంరాజును త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా నియమిస్తున్నట్లుగా ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయ‌న‌కు గవర్నర్ ప‌ద‌వి ఇచ్చార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంతో ఏకంగా ‌కొందరు నేత‌లు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్ష‌లు చెపుతున్నారు.

ఏపీలోని కాకినాడ నుండి 1998, 1999సంవ‌త్స‌రాల్లో బీజేపీ త‌రుపున అయన లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2000 సంవ‌త్స‌రంలో ప్రధాని వాజ్ పేయి హాయంలో కేంద్ర స‌హాయ‌మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన ఆయ‌న 2014 త‌ర్వాత మళ్ళీ బీజేపీలో చేరారు. కృష్ణంరాజుతో పాటే కేంద్ర‌మంత్రిగా ప‌నిచేసిన విద్యాసాగ‌ర్ రావు కొంత‌కాలం మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా, అదే సమయంలో కొంతకాలం తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా కూడా ప‌నిచేసిన సంగతి తెలిసిందే.