టీటీడీ ధార్మిక సంస్థనా లేక ధర్మసత్రమా: జగన్ పై బిజేపీ ఫైర్

 

 

36 మంది సభ్యులతో కూడిన కొత్త టీటీడీ ట్రస్ట్ బోర్డు ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని ఎపి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తప్పు పట్టారు. అసలు ఏ ఉద్దేశంతో 36 మంది సభ్యులను తీసుకున్నారని అయన సీఎం ను ప్రశ్నించారు. టీటీడీ బోర్డు సభ్యులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా వస్తే.. వాహన మండపం సరిపోదని ఆయన అన్నారు. ఎవరూ అడగరులే అన్న అహంకార ధోరణితో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని అయన మండిపడ్డారు.ముందుగా తిరుమల, టీటీడీ చరిత్ర ఏమిటో జగన్ తెలుసుకోవాలని భాను ప్రకాష్ సూచించారు. అవసరానికి మించి, రాజకీయ ప్రయోజనాల కోసం, అసంతృప్తులకు రాజకీయ పునరావాసం కల్పించేలా సీఎం జగన్ నిర్ణయాలు ఉంటున్నాయని అయన అన్నారు. సీఎం తాజా నిర్ణయంతో టీటీడీ ధార్మిక సంస్థనా లేక ధర్మసత్రమా అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రావాలి జగన్ అని కాకుండా... పోవాలి జగన్ అని ప్రజలు అంటున్నారని అయన ఎద్దేవా చేశారు.