TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విభేదాలు సృష్టించ‌డ‌మే కేంద్రం ప‌ని...మ‌మ‌తాబెన‌ర్జీ

Published on: Mon Sep 26, 2022 12:33PM

భ‌క్తి, స‌మైక్య‌తా భావ‌న‌ను పెంపొందించే దుర్గాపూజ స‌మ‌యంలోనూ బీజేపీ వ‌ర్గాలు విద్వేషాలు  రెచ్చ గొట్టేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం లేద‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మండి ప‌డ్డారు. ప్ర‌జ‌ల్లో మ‌త‌విద్వేషాలు రెచ్చ‌గొట్టి విభేదాలు తేవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆమె అన్నా రు. బీజేపీ అనుస‌రిస్తున్న రాజ‌కీయాలు ఏమాత్రం అంగీకార‌యోగ్యంగా లేవ‌ని ఆమె అభిప్రా య‌ప‌డ్డారు. దేశంలో మైనారిటీ వ‌ర్గాల ప‌ట్ల‌ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విప‌క్షాలు ఐక్య‌మై పోరాడ‌ వ‌ల‌ సిన అవ‌స‌ రాన్ని బ‌ల‌ప‌రు స్తోంద‌ని మ‌మ‌తా అన్నారు. ఆమె  టీఎంసీ ప‌త్రిక న‌జ్రూల్ మంచ్ ప్ర‌త్యేక సంచిక విడు ద‌ల చేసి ప్ర‌సం గించారు. 

బెంగాల్ ప్ర‌భుత్వాన్ని అన్నివిధాలా అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా  ప్ర‌య త్నిస్తోంద‌ని ఆ ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. రాష్ట్రేత‌రులు కొంద‌రు డ‌బ్బులు ఆశించి డిజిట్ ప్లాట్‌ఫామ్‌ల‌ను బాగా వినియోగించు కుంటున్నార‌ని, వీరే సోష‌ల్ మీడియా ద్వారా రాష్ట్ర  ప్ర‌గ‌తిప‌ట్ల వ్య‌తి రేక‌త తీవ్రస్థాయిలో ప్ర‌చారం చేయడం దారుణ‌మ‌న్నారు.  

దేశంలో అన్ని రాష్ట్రాల పాల‌నా వ్య‌వ‌హారాల్లోకి దూరి విభేదాలు సృష్టించి ప‌బ్బంగ‌డుపుకుంటున్న బీజేపీ వాస్త‌వానికి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, నిరోద్యోగుల స‌మ‌స్య‌ల గురించి నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఇప్ప‌టికే దేశంలో అన్నివ‌ర్గాల నుంచి నిర‌స‌న వెల్లువెత్తుతోంది. ఈ త‌రుణంలో బిజేపీ సిబిఐ, ఈడీల‌ను ఉసిగొల్పి విప‌క్షా ల‌పై ప‌గసాధించేందుకు పూనుకుని దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోందన్న‌ది విప‌క్షాల మాట‌.