TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీతో టచ్ లోకి వెళ్లిన టీడీపీ ఎంపీలు.. త్వరలోనే టీడీపీ ఖాళీ!!

Published on: Fri Jun 14, 2019 3:27PM

 

ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీని మరింత దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోని టీడీపీ ఎంపీలకు బీజేపీ గాలం వేస్తోంది. రాజ్యసభలో బీజేపీ సంఖ్య ప‌రంగా మైనారిటీలో ఉంది. రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు.. టీడీపీకి చెందిన ఎంపీలతో బీజేపీ నేతలు చర్చలు ప్రారంభించారనే ప్రచారం సాగుతోంది. టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, కనకమేడల రవీంద్రకుమార్‌పై బీజేపీ నేతలు కన్నేసినట్టుగా సమాచారం. వీరిలో ఇప్ప‌టికే ముగ్గురు ఎంపీలు బీజేపీతో ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఇక లోక్‌సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే వీరితో బీజేపీ నేతలు చర్చలు ప్రారంభించారని ప్రచారం సాగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీలోకి వెళ్తారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను కేశినేని నాని ఖండించారు. కానీ టీడీపీపై కేశినేని నాని అసంతృప్తితో ఉండడంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎంపీలు నిజంగానే టీడీపీని వీడి బీజేపీలో చేరితే.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.