బీజేపీ 24 గంటల దీక్ష సంపూర్ణం!
Published on: Tue Oct 1, 2024 1:18PM

రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీల అమలుపై కమలం పార్టీ చేపట్టిన 24 గంటల దీక్ష ముగిసింది. ఈ దీక్షలు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రుణమాఫీ సగంమందికి కూడా పూర్తి చేయలేదని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆరోపించారు . అన్నదాతలందరికీ వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతు భరోసా, బోనస్ కూడా విడుదల చేయాలని కోరారు.


