TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టి.ఆర్.ఎస్. కు షాకులిస్తున్న బిజెపి?

Published on: Fri May 18, 2012 2:36PM

తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.)కు శాకులిచ్చేందుకు భారతీయజనతాపార్టీ (బిజెపి) సిద్ధమైంది. ముందుగా ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని నెత్తిన పెట్టుకున్నది బిజెపియేనన్నది జగమెరిగిన సత్యం. అదీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఆ పార్టీ రాష్ట్రమహాసభల్లో. ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. ఆ ఏడాదే బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి వరకూ రాష్ట్రంలో స్పీకర్ గా ఉన్న చంద్రశేఖర రావు (ప్రస్తుత టి.ఆర్.ఎస్. అధినేత) తన పదవికి రాజీనామా చేసి టి.ఆర్.ఎస్.ను ఏర్పాటు చేశారు.

 

 

తెలంగాణా వాదాన్ని తెలివిగా ఉపయోగించుకున్నాడు. టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో కూడా అనూహ్యంగా విజయాలు సాధిస్తుండడంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. మొదట తామే తెలంగాణాకు అనుకూల తీర్మానాన్ని చేసినప్పటికీ ఫలితాలను మాత్రం కేసిఆర్ అనుభవిస్తున్నారన్న భావన బిజెపి నేతల్లో కలిగింది. అయినా ఎక్కడా బయటపడకుండా తనవంతు కృషి చేసిన బిజెపిని తెలంగాణావాదులూ గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే మహబూబ్ నగర ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఇది టి.ఆర్.ఎస్. అధినేతకు ఒక పెద్ద షాక్ కూడా అయింది. అయితే ఇదే ట్రీట్ మెంట్ ను కొనసాగించాలని తెలంగాణా బిజెపి నేతలు భావిస్తున్నారు.

 

అందుకే పరకాల ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని పోటీలోకి దింపు తున్నారు. అంతే కాకుండా ఆ అభ్యర్థి విజయానికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్ మొదటి దశలో భాగంగా బిజెపి కేంద్ర నేత సుష్మాస్వరాజ్ ను రప్పించాలని బిజెపి భావిస్తోంది. ఈలోగా తమ పార్టీ తలన్గానా ప్రత్యేకరాష్ట్రం కోసం చేసిన డిమాండును అప్పట్లో ప్రచురించిన మీడియా కథనాలను ఓటర్ల ముందుకు తేవాలని బిజెపి యోచిస్తోంది. లోక్ సభలో సుష్మా అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రత్యేకతెలంగాణా కోసం చేసిన ఉపన్యాసాలు కూడా ఓటర్లకు వినిపించాలని బిజెపి భావిస్తోంది. త్వరలో జరగబొయే సుష్మాస్వరాజ్ ఎన్నికల సభలకు పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తోంది.