TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్.. ఎందుకంటే?

Published on: Tue Aug 12, 2025 10:20AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) హౌస్ అరెస్ట్ చేశారు. అసలింతకీ రామచందర్ రావును పోలీసులు ఎందుకు హౌస్ అరెస్టు చేశారంటే.. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కూల్చివేతలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 12) పెద్దమ్మగుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెచ్చరిల్లే అవకాశం ఉందన్న భావనతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఇలా ఉండగా రామచందర్ రావు హౌస్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు.ఇలా ఉండగా పెద్దమ్మగుడి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.