ఏపీ బీజేపీ సెక్రటరీస్ లో జేపీ
Published on: Mon Aug 6, 2018 2:19PM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దక్షిణ రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది.. ముఖ్యంగా ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మి నారాయణ.. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేసే నేతలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.. తాజాగా ఏపీ బీజేపీ 14 మంది సెక్రటరీస్ ని ప్రకటించింది.. వారిలో తెలుగువన్ డైరెక్టర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ కూడా ఉన్నారు.. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా, నిజాయితీగా నిర్వర్తిస్తారని పేరున్న జయ ప్రకాష్ ను ఎంపిక చేయడం పట్ల పార్టీనేతలు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



