TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.!

Published on: Tue Nov 10, 2026 1:20PM

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు నిస్సందేహంలో వైసీపీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కు ఊహించని షాక్ ఇచ్చాయి. 2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది. అది పక్కన పెడితే ఓట్ల శాతంలో ఆ పార్టీ బీజేపీకి దిగువకుంది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా వెనుకబడిపోయింది. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే, వైఎస్సార్‌సీపీ ఏకంగా నాల్గో స్థానానికి పడిపోయి, చివరికి బీజేపీ కంటె కూడా తక్కువ స్థానాలను సాధించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ  పరాజయం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం మున్సిపాలిటీలలో టీడీపీ ఏకంగా 61 చోట్ల ఘన విజయం సాధించగా, జనసేన పార్టీ 16 స్థానాలను దక్కించుకుంది. అలాగే బీజేపీ  4 మున్సిపాలిటీలలో గెలుపొందింది. కానీ వై సీపీ కేవలం 3 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది. దీనితో ఏపీలో కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని బీజేపీ కంటే దిగువకు వైసీపీ పడిపోయింది.  

వార్డుల వారీగా చూస్తే జగన్ పార్టీ  పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తెలుగుదేశం కూటమి అభ్యర్థులు మున్సిపల్ వార్డులలో భారీ విజయాలను నమోదు చేశారు. టీడీపీ అభ్యర్థులు ఏకంగా 1,983 వార్డులను కైవసం చేసుకుంటే, జనసేన  363 వార్డుల్లో, బీజేపీ 115 వార్డులలో విజయం సాధించాయి. ఈ మూడు పార్టీల కూటమి మొత్తం 2,461 వార్డులను తన ఖాతాలో వేసుకుంది.   వైసీపీ కేవలం 416 వార్డులతో సరిపెట్టుకుంది. ఇక ఇతరులు 99 వార్డులలో గెలుపొందారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలలోనూ  కూడా  తెలుగుదేశం కూటమి   సత్తా చాటింది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 12 కార్పొరేషన్లను గెలుచుకోగా, వైసీపీ కేవలం ఒక్క కార్పొరేషన్‌తో సరిపెట్టుకుంది.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఇది వైపీకి అత్యంత భారీ పతనం. ఆ సమయంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలను ఏకపక్షంగా క్లీన్‌స్వీప్ చేసింది. అయితే కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం, పార్టీ గ్రాఫ్ అథఃపాతాళానికి పడిపోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని  కలవరపెడుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమి కంటే, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వై పీకి మరింత కోలుకోలేని దెబ్బగా నిలిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు

మునిసిపోల్స్ తరువాత జరిగిన పరిషత్ ఎన్నికలలో సైతం బీజేపీ అంతకంటే ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం పులివెందులలో కూడా ఉనికి మాత్రంగా మిగిలింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలతో పాటు రాయలసీమలో కూడా ఆ పార్టీ పరాజయాలు భారీగా ఉన్నాయి. ఇది వైసీపీ సంస్థాగతంగా ఎంత బలహీనంగా ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. 

 క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోయిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే  జగన్   విధానాలు, ముఖ్యంగా రాజధాని అంశానికి సంబంధించి ఆయన పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా చేస్తున్న ప్రకటనలు  ప్రజలలో ఆయన పట్ల, ఆయన పార్టీ పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అంటున్నారు. ఈ ఘోర పరాజయ పరంపర వైసీపీ  కేడర్‌  నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని చెబుతున్నారు. 

మీకు నచ్చవచ్చు:  జగన్ కంచుకోటలో కూటమి జెండా.. కడపలో వైసీపీకి భారీ షాక్.!

[BJP Ahead of YCP in AP, AP Municipal Polls Results, YSRCP Falls 4th, Below BJP, Telugudesham,  alliance, Grand, victory, Telugu One]