టాప్ నాలుగు పోస్టులు బీజేపీవే...

 


ఎప్పుడైతే ఎన్డీయే అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి... ప్రధాన మంత్రిగా మోడీ రంగంలోకి దిగారో అప్పటినుండి పార్టీ పరిస్థితే మారిపోయింది. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అంతేకాదు బీజేపీ మరో ఘనతను కూడా సాధించింది. అదేంటంటే.. దేశంలోనే ఉన్న నాలుగు టాప్ పోస్టుల్లో బీజేపీ నేతలే ఉన్నారు. ఈ రోజు బీజేపీ నేత వెంక‌య్య నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో...ఉన్నత హోదాల‌యిన రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, లోక్ స‌భ స్పీక‌ర్ పోస్టుల్లో న‌లుగురు నేత‌లూ బీజేపీకి చెందిన వారే ఉన్నారు. రాష్ట్రపతి గా రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతిగా వెంక‌య్య నాయుడు, ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ.. లోక్‌స‌భ స్పీక‌ర్ గా సుమిత్రా మ‌హాజ‌న్ ఉన్నారు. అయితే  రాజ్య‌స‌భ‌లో కీల‌కమైన డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌విలో కాంగ్రెస్ కు చెందిన పీజే కురియ‌న్ ఉన్నారు. ఇక ఆ ప‌దవిలోనూ త‌మ పార్టీ నేత‌ను కూర్చోబెట్టి క్లీన్ స్వీప్ చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. మరి బీజేపీ కోరిక తీరుతుందో..? లేదో..? చూద్దాం..