కమలం దిశగా సైకిల్‌ పయనం

 

బిజెపితో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు ఈ మేరకు సంకేతాలనిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితులను రాష్ట్రపతితో పాటు పలువురు నేతలతో చర్చించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయేతో కలిసి తాము దేశాన్ని ఎంతో అభివృద్ది చేశామన్న చంద్రబాబు, యుపిఏ మాత్రం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. అయితే ఈ సందర్భంలో విభజనకు ముందు నుంచి మద్దతు తెలుపుతున్న బిజెపిని చంద్రబాబు విమర్శించకపోగా, ప్రస్థుతం దేశంలో అభివృద్దిలో బాగంగా ఉన్న విశాలమైన రోడ్లు, ఐటి టెక్నాలజీ వంటివి బిజెపి చేసిన అభివృద్దే అని కొనియాడారు.

అయితే ఈ విషయం అధికారికంగా చెప్పాటనికి చంద్రబాబు ఇష్టపడలేదు, ఢిల్లీలో రాజ్‌నాధ్‌ను కలిసిన ఆయన్ను ఎన్డీఏతో పొత్తు, మోడి ప్రదాని అభ్యర్ధిత్వంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలను బాబు దాటవేశారు. దీంతో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాబు బిజెపిల పొత్తు కాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.