బిజెపికి షాక్ ఇచ్చిన విజయశాంతి
Published on: Thu Mar 15, 2012 12:57PM
హై
దరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో తెరాస గెలిస్తే వచ్చేది రజాకార్ల పాలన అని, తమ పార్టీతోనే తెలంగాణ వస్తుందన్న బిజెపి వ్యాఖ్యలపై ఆమె మండిపడింది. దేశాన్ని బిజెపి వాళ్లు పాలించినప్పుడు తెలంగాణ ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ఆమె టిఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ బిజెపికి దగ్గర అనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు జాతీయ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ యాత్రలో కూడా ఆమె టిఆర్ఎస్ శ్రేణులను కాదని పాల్గొన్నారు. బిజెపితోనే తెలంగాణ సాధ్యమని ఆమె చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అమె బిజెపిని ప్రశ్నించడం గమనార్హం. కాగా తన నియోజకవర్గంలో రెండు రైల్వే లైన్లు మంజూరు చేసినందుకు కేంద్రానికి విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు.


