కేఏ పాల్ బయోపిక్...ఆ హీరోతో ?

కేఏ పాల్...ఈ పేరు చెబితే చాలు అప్రయత్నంగానీ చిరునవ్వు మన ముఖాల మీద విరుస్తుంది. దానికి కారణం గత ఎన్నికల సమయంలో ఆయన జానానికి పంచి పెట్టిన కామెడీ అనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అంటూ ఒక పార్టీ తరపున ఆయన కూడా ఎన్నికల బరిలో దిగడమే. ఎన్నికల బరిలో దిగేందుకే అనుకుంటా ఒక ఏడాది కాలంగా ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేది తమ పార్టీనే అంటూ చాలా సార్లు చాల వేదికల మీద ప్రకటించిన పాల్ 80 ఓట్లు కూడా తెచ్చుకోలేక అభాసుపాలు అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే త్వరలోనే పాల్ బయోపిక్ తెరకేక్కుతుందట.

 

నిజానికి ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పారు. తన బయోపిక్ తీసేందుకు హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చూస్తున్నారని ఆ ఛాన్స్ వాళ్లకి ఇవ్వనని తానే ఒక దర్శకుడిని పెట్టి సినిమా తీస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అది నిజం ఎంతో తెలీదు కానీ, తాజగా ఒక తెలుగు దర్శకుడు ఆయన బయోపిక్ చేసేందుకు సిద్దం అయ్యాడట. అందులో పాల్ పాత్రకు సునీల్ ని తీసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడట. అంతే కాక ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉంటారట. అయితే ఈ కధ ఆయన జీవితం ప్రారంభం నుండి ఉంటుందా ? లేక రీసెంట్ ఎన్నికల ఎపిసోడ్ నా ? అనేదాని మీద క్లారిటీ లేదు.