TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు.. వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్

Published on: Wed Apr 1, 2026 2:06PM

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత, ఏకైక రాజధాని విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. లోక్ సభలో బుధవారం (ఏప్రిల్ 1)న ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టింది. కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. అమరావతికి తాము వ్యతిరేకం కాదని అంటూనే బిల్లు   ప్రస్తుత స్వరూపాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజధానిని ఎప్పటిలోగా నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేద న్నారు. 

ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న  బీజేపీ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ..  రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రస్థానం ప్రారంభించిందన్నారు.  నాడు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశంలో అస్థిరత ఏర్పడిందని  విమర్శించారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.