TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యార్థులపై ఏకే47తో కాల్పులు: బీహార్ లో ఎస్పీపై వేటు!

Published on: Wed Aug 19, 2026 9:16AM

బీహార్‌లో ఆందోళన బాట పట్టిన విద్యార్థుల నిరసన హింసాత్మక రూపం దాల్చింది. శాంతియుతంగా సాగాల్సిన ఆందోళన పోలీసులు ఏకంగా  ఏకే47తో కాల్పులు జరపడం   దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన బీహార్ సర్కార్ ఇందుకు బాధ్యులైన వారిపై  శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది.  ప్రాథమిక నివేదికలు, విచారణ ఆధారంగా సీవాన్ జిల్లా ఎస్పీ పూరన్ కుమార్ ఝాను  తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

వివరాల్లోకి వెడితే.. గత నెల  25న సీవాన్ ప్రాంతంలోని  జేపీ చౌక్ సమీపంలో  విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విధుల్లో  పోలీస్  అభిషేక్ కుమార్   ఏకే47తో కాల్పులకు తెగబడ్డాడు.దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వం  విధి నిర్వహణలో నిర్లక్ష్యం, గైడ్ లైన్స్ ఉల్లంఘన కారణంగా ఆ కానిస్టేబుల్ ను అప్పుడే సస్పెండ్ చేసింది.  

ఈ ఘటనపై  సుప్రీంకోర్టుకు బీహార్ ప్రభుత్వం సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆందోళనల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని, కోపోద్రిక్తులైన నిరసనకారుల మధ్య  కానిస్టేబుల్ చిక్కుకుపోవడంతో ఆత్మరక్షణార్థం గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు లేదా రక్షణ చర్యల పేరుతో ఏకే47 లాంటి   ఆటోమేటిక్ ఆయుధాలను వాడటంపై ప్రజా సంఘాలు, మానవ హక్కుల నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   

Bihar Student Protest, Siwan SP Removal, AK 47 Firing Siwan, Abhishek Kumar Constable, Bihar Police Action