కేంద్రానికి మరో షాక్... బీహార్ స్పెషల్ స్టేటస్ పై నోటీసు

 

కేంద్రానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆందోళన చేపట్టారు. దానికితోడు మరోపక్క రిజర్వేషన్లపై టీఆర్ఎస్ నేతలు, కావేరి నది జలాల వివాదంపై తమిళనాడు నేతలు కూడా ఆందోళనలు చేపడుతున్నారు. వీటితోనే కేంద్రం నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. తక్షణమే బీహార్ కు ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరపాలంటూ జన్ అధికార్ పార్టీ (జేఏపీ) ఎంపీ పప్పూ యాదవ్ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇచ్చారు. కాగా రెండ్రోజుల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, 13 ఏళ్ల క్రితమే ప్రత్యేక హోదా అంశాన్ని తాను లేవనెత్తానని చెప్పారు. ఈ డిమాండ్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.